కావలసిన వారితో లాలనగా హాస్య మైత్రి
ప్రతి కలహం వెనుక మైత్రి ఉంటుంది
ఉఛ్వాస నిఛ్వాసల మధ్య కలహం ఉంటుంది,
ఆ కలహం లేకుంటే ప్రాణం లేదు.
మంచి చెడుల మధ్య కలహం ఉంటుంది ,
ఆ కలహం లేకుంటే విచక్షణ లేదు .
కలపకి కలపకి మధ్య కలహం ఉంటుంది ,
ఆ కలహం లేకుంటే నిప్పు లేదు .
ఆమనికి విత్తుకి మధ్య కలహం ఉంటుంది ,
ఆ కలహం లేకుంటే చెట్టు లేదు .
ఆలోచనకి ఆచరణకు కలహం ఉంటుంది ,
ఆ కలహం లేకుంటే మనిషికి మనుగడ లేదు .
భావానికి పదానికి కలహం ఉంటుంది ,
ఆ కలహం లేకుంటే కవిత్వం లేదు .
No comments:
Post a Comment