Tuesday, May 12, 2015

చెలిమి విలువ దూరాలు కరగడం తోనే

వెలుగు విలువ చీకటితోనే ,
సంతోషం విలువ బాధ తోనే,
గెలుపు విలువ ఓటమి తోనే ,
సంతృప్తి విలువ ఆకలి తోనే ,
ఆనందం విలువ ప్రతీక్ష తోనే,
చెలిమి విలువ దూరాలు కరగడం తోనే ..

Friday, May 8, 2015

కలహం




కావలసిన వారితో లాలనగా హాస్య మైత్రి
ప్రతి కలహం వెనుక మైత్రి ఉంటుంది

ఉఛ్వాస నిఛ్వాసల మధ్య కలహం ఉంటుంది,
ఆ కలహం లేకుంటే ప్రాణం లేదు.

మంచి చెడుల మధ్య కలహం ఉంటుంది ,
ఆ కలహం లేకుంటే విచక్షణ లేదు .

కలపకి కలపకి మధ్య కలహం ఉంటుంది ,
ఆ కలహం లేకుంటే నిప్పు లేదు .

ఆమనికి విత్తుకి మధ్య కలహం ఉంటుంది  ,
ఆ కలహం లేకుంటే చెట్టు లేదు .

ఆలోచనకి ఆచరణకు కలహం ఉంటుంది ,
ఆ కలహం లేకుంటే మనిషికి మనుగడ లేదు   .

భావానికి పదానికి కలహం ఉంటుంది ,
ఆ కలహం లేకుంటే కవిత్వం లేదు .